రాష్ట్రంలో కాంగ్రెస్‌ను రోడ్డుకీడుస్తున్న సీనియర్లు
రాష్ట్రంలోని రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత సీనియర్లకు రెక్కలొచ్చాయి. ఇన్నాళ్ళూ చేతికి పనిలేక... నోట మాటరాకుండా ఉన్న వాళ్ళు ఒక సారిగా బిజి అయిపోయారు. పట్టుమని పది అడుగులు వేసే సత్తా లేకపోయినా సీనియర్లనే మిసతో రాష్ట్రరాజకీయాలలో గందరగోళం సృష్టిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని అయోమయ పరుస్తున్నారు.
రాష్ట్రంలోని సీనియర్లదే హవా నడుస్తున్న రోజుల్లో యువకెరటంలా ముందుకు వచ్చారు... రాజశేఖర్ రెడ్డి. అప్పటికే అధిష్టానంతో బలమైన సంబంధాలు కలిగిన వి.హనుమంత రావు. కే.కేశవరావులు ఆయన ఎదుట నిలబడలేకపోయారు. రాజశేఖ రెడ్డి ఉన్నన్నాళ్ళు వారికి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ మరణం తరువాత కేకే రాష్ట్రంలో వాలిపోయారు. రాజకీయ ప్రకటనలతో లేనిపోని రాద్ధాంతం సృష్టించారు. శాసన సభా ఎన్నికల సమయంలో రాజశేఖర్ రెడ్డి అన్నీ తానే అయి చేస్తుంటే ఇటు వైపు కన్నెత్తి చూడని నాయకులు ఇప్పుడు కీలక పాత్ర పోషించడానికి తగుదుమమ్మ అంటూ తెరపైకి వచ్చారు.
జగన్‌మోహన్ రెడ్డి సిఎం చేయాలనే ప్రతిపాదనకు అడుగడుగున అడ్డుపడుతున్నారు. పార్టీలో సభ్యత్వం కలిగి ఉన్న వారికి ఆ హక్కు ఉంది. వంద యేళ్ళ చరిత్ర కలిగిన పార్టీలో ఉన్న వీరు ఏ మాత్రం బాధ్యతలేకుండా వ్యవహరిస్తున్నారనడంలో ఏమాత్రం సందేహం లేదు. పార్టీని ఒంటిచేత్తో నడిపిన నాయకుడు, ఇక రాలేమేమో అనేంతగా ప్రతిపక్షాల గుండెళ్ళో రైళ్లు పరిగెత్తించిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి మృతి చెందితే..... సీనియర్లుగా వీరి పాత్ర ఏమిటి? పార్టీ నిలబెట్టడంలో పాలు పంచుకోవాలి. కానీ ఏం చేస్తున్నారు. అంతా అధిష్టానం చేతుల్లోనే ఉందంటూ నిత్యం పత్రికలకెక్కుతూ ప్టారీని బజారుకీడ్చుతున్నారు. కాంగ్రెస్ పార్టీని సంక్షోభంలోకి నెట్టేస్తున్నారు. ఇదేనా వీరికున్న బాధ్యత.font>
లోడ్ అవుతోంది...